Share News

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు సమగ్ర కార్యాచరణ

ABN , Publish Date - Oct 07 , 2026 | 09:06 PM

రాష్ట్రంలో వాయు కాలుష్య నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ అమలు చేయనుంది. వాయు నాణ్యతపై శాస్త్రీయ పర్యవేక్షణ.. AQMC కీలక సమీక్ష సమావేశం నిర్వహించింది.

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు సమగ్ర కార్యాచరణ
Telangana Air Pollution Control

హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వాయు కాలుష్య నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ అమలు చేయనుంది. ఇందులో భాగంగా వాయు నాణ్యతపై శాస్త్రీయ పర్యవేక్షణ.. AQMC కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. కాలుష్య మూలాల నియంత్రణకు ఆయా శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టనుంది. హైదరాబాద్‌లో PM10 స్థాయి 86 నుంచి 80 µg/m³కు తగ్గింది. సంగారెడ్డిలో PM10 స్థాయి 87 నుంచి 78 µg/m³కు తగ్గింది. నల్గొండలో PM10 స్థాయి 59 నుంచి 71 µg/m³కు పెరిగింది. CURE పరిధిలో 13 కొత్త CAAQMSల ఏర్పాటు ప్రక్రియను చేపట్టనుంది. వాయు నాణ్యతపై ‘ఎయిర్ క్వాలిటీ డ్యాష్‌బోర్డు’ను కూడా ఏర్పాటు చేయనుంది.


కాలుష్య హెచ్చరికలపై ఆయా శాఖలకు SMS అలర్ట్ వ్యవస్థను తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేయనుంది. బొల్లారం, జీడిమెట్లలో ఇప్పటికే 8 లో కాస్ట్ సెన్సార్లను ఏర్పాటు చేసింది. రోడ్ డస్ట్ నియంత్రణకు మెకానికల్ రోడ్ స్వీపింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వనుంది. వాహన కాలుష్య నియంత్రణకు PUC వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. రాష్ట్రంలోని 516 PUC కేంద్రాలను కేంద్ర సర్వర్‌కు అనుసంధానం చేయనుంది. ఇప్పటివరకు 36.14 లక్షల వాహనాల PUC పరీక్షలు జరిగినట్లు తెలపింది. PUC గడువు ముగిసిన వాహనాలపై ఆటోమేటిక్ చలాన్లకు చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో 310 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. కాలుష్య మూలాల గుర్తింపునకు నల్గొండ, సంగారెడ్డిలో SAS అధ్యయనం చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా Emission Inventoryకు చర్యలు చేపట్టనుంది. డీజిల్ జనరేటర్ల కాలుష్య నియంత్రణకు RECD అమలు చేయనుంది.


వ్యవసాయ అవశేషాల బహిరంగంగా దహనం చేయడంపై రైతులకు అవగాహన కార్యక్రమాలను తెలంగాణ సర్కార్ చేపట్టనుంది. వ్యవసాయ వ్యర్థాలతో బ్రికెట్లు, పెల్లెట్ల తయారీకి ప్రోత్సాహం కల్పించనుంది. NCAP నిధుల వినియోగంపై AQMC ప్రత్యేకంగా సమీక్షించనుంది. 2026–27లో నల్గొండ, సంగారెడ్డికి రూ.7.25 కోట్ల NCAP నిధులు విడుదల చేయనుంది. స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండ 16వ వార్డుకు జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ వచ్చింది. ఈ వార్డుకు రూ.20 లక్షల పురస్కారాన్ని అందజేయనుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్, గన్‌ఫౌండ్రీ వార్డులకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ఆయా శాఖల సమన్వయంతోనే వాయు కాలుష్యానికి దీర్ఘకాలిక పరిష్కారాన్ని టీజీపీసీబీ చూపించనుంది. హైదరాబాద్ – సికింద్రాబాద్‌లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణకు చర్యలు చేపట్టనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 09:31 PM