Share News

ముగిసిన ఫారం 6, 7, 8 దరఖాస్తుల స్వీకరణ

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:55 AM

తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, ఓటరు వివరాల్లో సవరణలకు సంబంధించిన ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది.

ముగిసిన ఫారం 6, 7, 8 దరఖాస్తుల స్వీకరణ
Telangana SIR 2026

  • తెలంగాణ ‘సర్‌’లో కీలక ఘట్టం పూర్తి

  • ఇకపై వచ్చే ఫారం- 6 దరఖాస్తుల పరిశీలన సర్‌ తర్వాతే

  • కొత్త ఓటరు నమోదు ప్రక్రియ ఆగదు: సీఈవో సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, ఓటరు వివరాల్లో సవరణలకు సంబంధించిన ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. తాజా లెక్కల ప్రకారం మొత్తం 7,56,180 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం-6 దరఖాస్తులు 4,40,942 ఉన్నాయి. ప్రవాస భారతీయ ఓటర్లకు సంబంధించిన ఫారం-6ఏ దరఖాస్తులు 6,240, ఓటర్ల పేర్ల తొలగింపునకు ఫారం-7 దరఖాస్తులు 27,555, ఓటర్ల వివరాల మార్పు, సవరణలు, చిరునామా మార్పు తదితరాలకు సంబంధించిన ఫారం-8 దరఖాస్తులు 2,81,443 ఉన్నాయి.


బుధవారం వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది ఓటరు జాబితాలో అర్హులను చేరుస్తామని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. సర్‌ కోసం నిర్దేశించిన గడువు ముగిసినా కొత్త ఓటర్ల నమోదు, సవరణల ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై కూడా ఫారం-6, 7, 8లను స్వీకరిస్తామని తెలిపారు అయితే, సర్‌ తుది జాబితాలో కాకుండా ఎన్నికల సంఘం తదుపరి రూపొందించే జాబితాలో అర్హులుగా గుర్తిస్తే. కొత్త ఓటర్ల పేర్లను జాబితాలో చేరుస్తామని వెల్లడించారు. అలాగే, సర్‌ తుది జాబితా వెలువడిన తర్వాత కూడా 18 ఏళ్లు నిండిన అర్హులైన యువత, ఇప్పటి వరకు ఓటరు నమోదు చేసుకోని వారు కూడా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సీఈఓ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...
ఆర్టీసీ విలీనం కాంగ్రెస్‌తోనే సాధ్యం: మహేశ్‌గౌడ్‌

రేపే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు
దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 05:55 AM