తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభం.. రాష్ట్రవ్యాప్తంగా 335 కేంద్రాల ఏర్పాటు
ABN , Publish Date - Nov 29 , 2026 | 10:24 AM
తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 335 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1.6 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్, నవంబరు 29: తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ఈ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 1.6 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 335 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. గంట ముందే అభ్యర్థును పరీక్షా కేంద్రంలోనికి అనుమతించి బయోమెట్రిక్ నమోదు చేసుకున్నారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా పరీక్ష నిర్వహించేందుకు టీజీపీఎస్‌సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News