Share News

విద్యుత్ వినియోగదారులపై రూ.5,420 కోట్ల భారం.. టీజీఈఆర్సీ కీలక ఉత్తర్వులు

ABN , Publish Date - Oct 05 , 2026 | 09:37 PM

విద్యుత్‌ వినియోగదారులపై రూ.5,420 కోట్ల భారాన్ని తెలంగాణ ప్రభుత్వం మోపింది. నవంబర్‌ కరెంట్‌ బిల్లుల నుంచే ట్రూ-అప్‌ వసూలు చేయనుంది.

విద్యుత్ వినియోగదారులపై రూ.5,420 కోట్ల భారం.. టీజీఈఆర్సీ కీలక ఉత్తర్వులు
True-Up Charges

హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారులపై రూ.5,420 కోట్ల భారాన్ని తెలంగాణ ప్రభుత్వం మోపింది. నవంబర్‌ కరెంట్‌ బిల్లుల నుంచే ట్రూ-అప్‌ వసూలు చేయనుంది. తొలి నెల యూనిట్‌కు 30 పైసలు.. ఆ తర్వాత 50 పైసలు విధించనుంది. ఈ మేరకు టీజీఈఆర్సీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్‌ వసూలు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ వినియోగదారులకు ట్రూ-అప్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. రైతుల వాటా రూ.2,214.99 కోట్లను ప్రభుత్వమే చెల్లించనున్నట్లు తెలిపింది.


ఇతర వినియోగదారుల నుంచి రూ.5,420.23 కోట్ల వసూలు చేయనుంది. టీజీఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో రూ.4,222.93 కోట్లు, టీజీఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో రూ.1,197.30 కోట్లు వసూలు చేయనుంది. ట్రూ-అప్‌ ఛార్జీని బిల్లులో ప్రత్యేకంగా చూపించాలని ఆదేశించింది. వసూలు విధానం, రేటు, వ్యవధిని బిల్లులో స్పష్టంగా పేర్కొనాలని చెప్పింది. టీజీఎస్‌పీడీసీఎల్‌లో 29 నెలలు, టీజీఎన్‌పీడీసీఎల్‌లో 26 నెలల్లో నగదు వసూలు చేయనుంది. వినియోగదారుల గత వినియోగం ఆధారంగా ట్రూ-అప్‌ లెక్కించనుంది. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూలో ముందస్తు ప్రచారం ఇవ్వాలని డిస్కంలకు తెలంగాణ సర్కార్ ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ ముందంజలో ఉంది: కిషన్‌రెడ్డి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు.. క్లిష్ట దశను దాటాం: మంత్రి ఉత్తమ్

వెయ్యిరోజులు దాటినా 6 గ్యారెంటీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలం: హరీశ్‌రావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 10:01 PM