ప్రియాంక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి వాకిటి శ్రీహరి
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:06 PM
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఉన్న ప్రియాంక భౌతికకాయం దగ్గర మంత్రి వాకిటి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ నివాళులర్పించారు.
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యార్థిని ప్రియాంక మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) డిమాండ్ చేశారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఉన్న ప్రియాంక భౌతికకాయం దగ్గర మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ నివాళులు అర్పించారు. ప్రియాంక తండ్రిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రియాంక ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి తమకు, అధికారులకు ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశాలు ఇచ్చారని మంత్రి అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెప్పుకొచ్చారు. ప్రియాంక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని నిందితులు తప్పించుకోకుండా కఠినతరం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు కూడా చదవండి...
కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క
తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్
సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News