Share News

నా మాటలు వక్రీకరించారు: మంత్రి పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - May 12 , 2026 | 08:25 PM

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని మాత్రమే తాను మాట్లాడానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేసే అంశంపైనే తాను మాట్లాడానని.. తన మాటలను కొంతమంది వక్రీకరించారని పేర్కొన్నారు.

నా మాటలు వక్రీకరించారు: మంత్రి పొన్నం ప్రభాకర్
Telangana Minister Ponnam Prabhakar

హైదరాబాద్, మే12 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని మాత్రమే తాను మాట్లాడానని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేసే అంశంపైనే తాను మాట్లాడానని.. తన మాటలను కొంతమంది వక్రీకరించారని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం)హైదరాబాద్ వేదికగా మంత్రి పొన్నం మాట్లాడారు. ఈ కేసులో భగీరథ్ విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని తాను అన్నానని ప్రస్తావించారు.


ఈ విషయంలో కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మున్నూరు కాపు సంఘాలు ఆరోపణలు చేశాయని అన్నారు. ఈ కేసులో బాధితురాలు కూడా అదే సామాజిక వర్గమని తాను చెప్పానని ప్రస్తావించారు. తన ఉద్దేశంలో కూడా బాధితురాలికి న్యాయం జరగాలనే తపన మాత్రమే ఉందని అన్నారు. ఇందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాలని తాను మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. బాధితురాలికి కాంగ్రెస్ అండగా ఉంటుందని.. వారికి పూర్తిగా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 12 , 2026 | 08:38 PM