Share News

రోడ్ల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్

ABN , Publish Date - May 11 , 2026 | 07:51 PM

హ్యామ్ ప్రాజెక్ట్ పురోగతిపై తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం సచివాలయంలో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు.

రోడ్ల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
Minister Komatireddy Venkat Reddy

హైదరాబాద్, మే11 (ఆంధ్రజ్యోతి): హ్యామ్ ప్రాజెక్ట్ పురోగతిపై తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఈరోజు (సోమవారం) సచివాలయంలో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. హ్యామ్ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియపై అధికారులను ఆరా తీశారు. దేశవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఏఐ, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న హ్యామ్ మోడల్ వివరాలు మంత్రికి వివరించారు అధికారులు. బిటుమెన్ ధర మెట్రిక్ టన్నుకు రూ.44 వేల నుంచి రూ.89 వేలకు పెరిగిందని తెలిపారు.


బిటుమెన్ ధరల్లో దాదాపు వందశాతం పెరుగుదల నమోదైందని అధికారులు వివరించారు. జీఎస్టీ అదనపు భారం, ఇతర మెయింటెనెన్స్, పశ్చిమాసియ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ధరలు పెరగడానికి కూడా ఓ కారణమని అధికారులు పేర్కొన్నారు. గుజరాత్‌లో 66శాతం, మహారాష్ట్రలో 47శాతం ధరలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ధరలు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు.


రూ.4 నుంచి రూ.5 లక్షల కోట్లతో దేశంలో 374కు పైగా హ్యామ్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. నాణ్యమైన మౌలిక వసతుల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని చెప్పుకొచ్చారు. మొత్తం 6,092 కిలోమీటర్ల పొడవుతో 34 ప్యాకేజీలుగా హ్యామ్ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. హ్యామ్ తుది అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డితో రేపు (మంగళవారం) లేదా ఎల్లుండి (బుధవారం) కలిసి చర్చిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకారం కావాలి: సీఎం రేవంత్‌

ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ

మోదీ ఆశీస్సులు, మార్గదర్శనం నాకు ఎప్పటికీ ప్రత్యేకం: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 07:55 PM