యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటాలో.. మిగిలిన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:20 AM
ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న యాజమాన్య (కేటగిరీ-బీ), ఎన్‌ఆర్‌ఐ (కేటగీరీ-సీ) కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి మరో విడత అవకాశం కల్పిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్శిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
మళ్లీ దరఖాస్తుల స్వీకరణ..
నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ వర్సిటీ
హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న యాజమాన్య (కేటగిరీ-బీ), ఎన్‌ఆర్‌ఐ (కేటగీరీ-సీ) కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి మరో విడత అవకాశం కల్పిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్శిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎంబీబీఎ్‌సలో బీ- కేటగిరీ కింద 9 సీట్లు, సీ- కేటగిరీ కింద 176 సీట్లు మిగిలాయి. అలాగే బీడీఎస్‌లో 35 సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటా కింద మిగిలిపోయాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక రేస్ట రౌండ్ నిర్వహించేందుకు కాళోజీ హెల్త్ వర్సిటీ రిజిస్ర్టార్ శనివారం ప్రకటన విడుదల చేశారు. 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిరేస్ట్రేషన్‌లకు అవకాశం కల్పించారు. గతంలో మేనేజ్‌మెంట్ కోటాలో బీ కేటగీరీ కింద రిజిరేస్ట్రేషన్ చేసుకుని.. ఇప్పుడు సీ కేటగీరీ(ఎన్‌ఆర్‌ఐ) కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. తమ ఎన్‌ఆర్‌ఐ సంబంధిత ధ్రువపత్రాలతో పాటు, బీ కేటగీరీ దరఖాస్తు ప్రతిని knrugadmission@gmail.com మెయిల్‌కు పంపించాలి. వీరు మళ్లీ రిజిరేస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
పీజీ మెరిట్ అభ్యరుల జాబితా విడుదల...
కన్వీనర్ కోటాలో పీజీ సీట్ల భర్తీ కోసం అర్హులైన 3,518 మంది అభ్యర్ధుల జాబితాను హెల్త్ యూనివర్శిటీ శనివారం విడుదల చేసింది. జాబితాపై అభ్యంతరాలుంటే ఈనెల 9న సాయంత్రం 4 గంటల వరకు ‘కేఎన్‌ఆర్‌పీజీఅడ్మిషన్ ఎట్ జీ’ మెయిల్‌కు పంపాలని కోరింది.
బీఎస్సీ అగ్రికల్చర్‌లో 60 స్పాన్సర్డ్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో 60 స్పాన్సర్డ్ సీట్ల భర్తీకి మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. టీజీ-ఎప్‌సెట్ -2026లో అర్హత సాధించిన బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు https://ug.mjptbcwreis.net వెబ్‌సైట్‌లో రూ.200 దరఖాస్తు రుసుము చెల్లించి, అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. వివరాలకు 040-23328266 నంబరులో సంప్రదించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News