న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:48 AM
న్యాయవాదులకు స్టైఫండ్ పెంపుతో పాటు వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, వారి సమస్యలపై వచ్చే నవంబరులో సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.
ఇప్పటికే వారికి రక్షణ చట్టం తెచ్చాం: మహేశ్ కుమార్
న్యాయవాదులకు నామినేటెడ్ పోస్టులు: మంత్రి పొన్నం
వారికి త్వరలో 5 లక్షల ఆరోగ్య బీమా: మంత్రి శ్రీధర్ బాబు
జిల్లాల్లో లాయర్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం: మంత్రి వివేక్
హైదరాబాద్, అక్టోబర్ 24 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదులకు స్టైఫండ్ పెంపుతో పాటు వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, వారి సమస్యలపై వచ్చే నవంబరులో సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్‌లో లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి, ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ... రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన న్యాయవాదులకు నామినేటెడ్ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. న్యాయవాదులకు వర్తించే హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ.5లక్షలకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ప్రమాద బీమా వర్తింపజేస్తామని ప్రకటించారు. కోర్టుల్లో జీపీ, ఏజీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్టాండింగ్ కౌన్సిల్ పోస్టుల భర్తీపై సీఎం కసరత్తు చేస్తున్నారని తెలిపారు. మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ.. లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 31 లాయర్స్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన న్యాయవాదులకు ప్రభుత్వ లీగల్‌పోస్టుల భర్తీలో ప్రాధాన్యత దక్కేలా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!
పనిచేయండి.. లేకుంటే తప్పుకోండి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News