Share News

పనిచేయండి.. లేకుంటే తప్పుకోండి!

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:43 AM

‘పని చేయండి.. లేకుంటే తప్పుకోండి.. మరొకరు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నార’ని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ పార్టీ నాయకులకు తేల్చిచెప్పారు. పనిచేయకుండా పదవుల్లో కొనసాగుతామంటే కుదరదని, వారిని తప్పిస్తామని స్పష్టం చేశారు.

పనిచేయండి.. లేకుంటే తప్పుకోండి!
Sunil Bansal Telangana BJP

  • రాష్ట్ర బీజేపీ నాయకులకు సునీల్‌ బన్సల్‌ అల్టిమేటం

  • కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు..

  • బీజేపీ నిర్ణయం

  • 1న హైదరాబాద్‌లో పాదయాత్ర

  • 3న కరీంనగర్‌లో సభ

హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘పని చేయండి.. లేకుంటే తప్పుకోండి.. మరొకరు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నార’ని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ పార్టీ నాయకులకు తేల్చిచెప్పారు. పనిచేయకుండా పదవుల్లో కొనసాగుతామంటే కుదరదని, వారిని తప్పిస్తామని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు అవసరమా? అని బన్సల్‌ పలువురు రాష్ట్ర పార్టీ నాయకులకు తలంటారు. ‘రోజూ హైదరాబాద్‌ పార్టీ ఆఫీసుకు వచ్చి వెళ్లడం కాదు.. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి. స్పందించాల’ని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జిగా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన బన్సల్‌.. తొలుత కోర్‌ కమిటీతో భేటీ అయ్యారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన... ఆ తర్వాత రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహించారు.


పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సహ ఇన్‌చార్జిలు అభయ్‌పాటిల్‌, రేఖా శర్మ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, ఎంపీలు లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్సల్‌ కొంతమంది నాయకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవాళ్లు పార్టీ పదవులను వదలుకోండి.. నియోజకవర్గాలకు వెళ్లి పనిచేసుకోండ’ని బన్సల్‌ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయా లు తీసుకున్నారు. వచ్చే 6 నెలల్లో కీలక పరిణామాలుంటాయని బన్సల్‌ చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సంస్థాగతంగా మార్పులుచేర్పులుఉంటాయన్నట్లు సమాచారం.


ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ కుట్ర

ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని బీజేపీనేతలు ఆరోపించారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదులను తరిమికొడదాం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ‘ప్రధా న నగరాలు, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, పాదయాత్రలు చేస్తాం. నవంబరు 1న హైదరాబాద్‌లో భారీ పాదయాత్ర నిర్వహిస్తాం. 3న కరీంనగర్‌లో నిర్వహించే ర్యాలీకి కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ హాజరవుతారు.


నిర్మ ల్‌, సిద్దిపేట, వరంగల్‌లో కూడా ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తాం. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మేధావులతో ‘సర్‌’పై సదస్సులు ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారంపై వివరిస్తామ’ని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభు త్వ వైఫల్యాలపై పోరాటా లు ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ నియోజకవర్గానికి ఎన్‌.రాంచందర్‌రావు పేరు ఖరారైన ట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ నిర్ణయం తీసుకుంటారని బన్సల్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!

హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్‌ ధర 2 లక్షలు

రైతుపై గజ్వేల్‌ ఎస్సై దాడి ?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 05:43 AM