Share News

ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:23 AM

ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా కృషి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది

  • నాణ్యత విషయంలో రాజీపడబోం

  • కౌకూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి

నేరేడ్‌మెట్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా కృషి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శనివారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని యాప్రాల్‌ డివిజన్‌ పరిధిలోని కౌకూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఫ్లాట్ల మంజూరుకు లాటరీ డ్రా తీసి లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలను అందజేశారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ టవర్ల నిర్మాణంలో నాణ్యత విషయం రాజీపడేది లేదన్నారు.


ప్రైవేట్‌ టవర్ల నిర్మాణాల నాణ్యత, కాలపరిమితి వంటి అంశాలను పరిశీలించి అనుమతులిచ్చే రెరా సంస్థకు ఇందిరమ్మ టవర్ల పర్యవేక్షణ బాధ్యతను అప్పగిస్తున్నామని చెప్పారు. దీంతో నిర్ణీత కాలపరిమితిలోగా నాణ్యతతో కూడిన ఇందిరమ్మ టవర్ల నిర్మాణం జరుగుతుందని.. ఏడాదికల్లా వీటి నిర్మాణం పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాగుతోందని.. ఇప్పటికే 2,25,100 ఇళ్లు నిర్మించి దీపావళి రోజు లబ్ధిదారులకు అందించామని వివరించారు. రాష్ట్రంలో మహిళాభ్యుదయం కోసం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని.. కొత్తగా 4.75 లక్షల ఆసరా, ఇతర పెన్షన్లు మంజూరు చేశామని వెల్లడించారు. గతేడాది మహిళలకు మంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తే, ఇటీవల కోటి చిలక పచ్చ రంగు చీరలు ఇచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన చీరలకు.. ఈ సర్కారు ఇచ్చిన చీరలకు తేడా గమనించాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 04:24 AM