తెలంగాణలో ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల జీవిత బీమా: డిప్యూటీ సీఎ: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Nov 13 , 2026 | 07:59 PM
తెలంగాణలో ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19 నుంచి లబ్దిదారుల నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19 నుంచి లబ్దిదారుల నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు ప్రతి కుటుంబానికీ జీవిత బీమా కల్పించిన ఏకైక, తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని భట్టి అన్నారు.
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం ప్రకారం.. ప్రతి కుటుంబంలో ఒక సంపాదనపరుడికి రూ. 5 లక్షల జీవిత బీమాను కల్పించనున్నట్లు తెలిపారు. ఒకరికంటే ఎక్కువ మంది సంపాదనపరులుంటే.. ఎవరి పేరు మీద బీమా చేయాలో ఎంపిక చేసుకునే అధికారం కుటుంబానికే ఉంటుందన్నారు. నామినీలుగా.. ఒకరు లేదా పలువురి పేర్లను ఎంపిక చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. బీమా మొత్తంలో.. ఏ నామినీకి ఎంత వాటా చెల్లించాలో నిర్ణయించుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా.. ప్రభుత్వం అందరికీ బీమా కల్పిస్తుందని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో ఏకకాలంలో నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రామాల్లో దండోరా ద్వారా ప్రచారం చేయించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నమోదు ప్రక్రియ ముగిసిన అనంతరం.. ఆ వివరాలను కుటుంబ సభ్యులకు చదివి వినిపించిన తరువాతనే సంతకం తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
పదేళ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా?.. కేటీఆర్‌పై పొన్నం ఫైర్
రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ ఫైర్.. రూ.100 కోట్ల ఖర్చుపై ప్రశ్నలు
Read Latest Telangana News And Telugu News