తెలంగాణలో రెవెన్యూ అధికారుల బదిలీలు.. జీవో 630 విడుదల చేసిన సర్కార్
ABN , Publish Date - Oct 09 , 2026 | 07:01 PM
తెలంగాణలో రెవెన్యూ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేస్తూ జీవో నంబర్- 630ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది.
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రెవెన్యూ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) బదిలీ చేసింది. ఈ మేరకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేస్తూ జీవో నంబర్- 630ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. బి. రాజాగౌడ్ జగిత్యాల అదనపు కలెక్టర్ (LB) నుంచి నిజామాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీ చేసింది. ఎన్. ప్రసూనాంబ జగిత్యాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించింది. డి. వెంకట మాధవరావు నిర్మల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించింది.
పి. రామ్‌రెడ్డి వనపర్తి జిల్లా రెవెన్యూ అధికారి (DRO)గా బదిలీ చేసింది. ఎ. యాదగిరి మహబూబ్‌నగర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (LA)గా పోస్టింగ్ ఇచ్చింది. మోహన్ సింగ్ రాజన్న-సిరిసిల్ల జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (LA)గా నియమించింది. పి. పద్మప్రియ హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (HMRL)కు డిప్యుటేషన్‌పై బదిలీ చేసింది. సీహెచ్. కృష్ణయ్య మేడ్చల్ - మల్కాజిగిరి SDC, ULCగా నియమించింది. జి. కుమారస్వామి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (LA)గా తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఈసీ, కేంద్ర విధానాలపై మా పోరాటం ఆగదు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణను అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి: సీఎస్
మహిళా సాధికారతకు కొత్త అడుగు.. జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News