Share News

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ABN , Publish Date - Feb 20 , 2026 | 07:45 PM

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
Telangana Government

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ (Telangana Government) ప్రత్యేక దృష్టి సారించింది. గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే నోడల్ అధికారుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది. డిటైల్డ్ ఎంక్వైరీ క్యాలెండర్ సిద్ధం చేయాలని సూచించింది. జిల్లా షెడ్యూల్ ప్రకారం.. తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.


ఆకస్మిక సందర్శనలతో పాటూ పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. తనిఖీ నివేదికలను వెంటనే అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. అధికారులు తీసుకున్న చర్యల వివరాలు వెంటనే తెలియజేయాలని హుకుం జారీ చేసింది. ప్రతి నెలా 5వ తేదీలోపు నివేదిక సమర్పణని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు

మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 07:56 PM