తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పింఛన్‌దారుల కుటుంబాలకు భారీ ఊరట
ABN , Publish Date - Oct 30 , 2026 | 08:55 PM
తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రధాన సామాజిక భద్రతా పింఛన్లలోనూ ఇన్‌స్టంట్ పెన్షన్ సదుపాయం కల్పించింది.
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మానవీయ కోణంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రధాన సామాజిక భద్రతా పింఛన్లలోనూ ఇన్‌స్టంట్ పెన్షన్ సదుపాయం కల్పించింది. మంత్రి సీతక్క ఆదేశాలతో పెన్షన్ విధానంలో కీలక మార్పులు చేసింది. దివ్యాంగులు, గీత, చేనేత కార్మికుల పింఛన్లకూ దీనిని వర్తింప చేసింది. డయాలసిస్, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితుల కుటుంబాలకూ సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఊరట కల్పించింది.
పింఛన్‌దారుడైన భర్త మరణిస్తే భార్యకు తక్షణమే పెన్షన్‌ను ప్రభుత్వం మంజూరు చేయనుంది. 57 ఏళ్లలోపు భార్యకు వితంతు పింఛన్.. 57 ఏళ్లు దాటితే వృద్ధాప్య పింఛన్‌ను ఇవ్వనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, మరణ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. చేయూత పోర్టల్‌లో వివరాల నమోదు.. అర్హత పరిశీలన అనంతరం పెన్షన్‌ను తెలంగాణ సర్కార్ మంజూరు చేయనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి భద్రత కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
కరవును చంద్రబాబు బాగా మేనేజ్ చేశారు.. కేటీఆర్ ప్రశంసలు
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News