Share News

2బీహెచ్‌కే కాలనీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. రూ.53 కోట్లతో కీలక పనులు

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:31 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2బీహెచ్‌కే కాలనీలకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది.

2బీహెచ్‌కే కాలనీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. రూ.53 కోట్లతో కీలక పనులు
Telangana Government

హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2బీహెచ్‌కే కాలనీలకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. క్యూర్ పరిధిలోని 2బీహెచ్‌కే ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆయా పనుల కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. కనెక్షన్ ఛార్జీలు రాకముందే పనులు ప్రారంభించేందుకు పచ్చజెండా ఊపింది.


సాధ్యమైన చోట ముందుగానే నీటి, డ్రైనేజీ కనెక్షన్ల విడుదలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. మొత్తం 17 ప్రాంతాల్లో కనెక్షన్లకు రూ.53.12 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించింది. నీటి సరఫరా నెట్‌వర్క్ అభివృద్ధికి రూ.17.73 కోట్లుగా నిశ్చయించింది. డ్రైనేజీ నెట్‌వర్క్ అభివృద్ధికి రూ.2.27 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు జలమండలి ఎండీ నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ జీవో నంబర్ - 1037ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

పాలమూరును తెలంగాణకే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్‌‌రెడ్డి

‘సర్’ పై విమర్శలు చేసే నైతిక హక్కు రేవంత్‌కు లేదు.. బండి సంజయ్ ధ్వజం

పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ ఓవరాల్ ఛాంపియన్: డీజీపీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 04:12 PM