Share News

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. TG SAFE ఏర్పాటు

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:44 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్‌ను రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. TG SAFE ఏర్పాటు
TG SAFE

హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్‌ను (TG SAFE) రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసింది. ఆహార భద్రత, డ్రగ్స్ కంట్రోల్ విభాగాల విలీనానికి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలు ఇకపై ఏకీకృత పరిపాలన కింద పనిచేయనున్నాయి. ఆహారం, మందులు, కాస్మెటిక్స్‌పై లైసెన్సింగ్, తనిఖీలు, శాంప్లింగ్, పరీక్షలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయనుంది.


TG SAFEలో డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ & ప్రాసిక్యూషన్, ల్యాబొరేటరీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు పనిచేయనున్నాయి. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను ఒకే ల్యాబొరేటరీ విభాగం కిందకు ప్రభుత్వం తీసుకురానుంది. అక్రమాలు, కల్తీపై నిఘా పెంచేందుకు ఇంటెలిజెన్స్, రిస్క్ ఆధారిత తనిఖీలను TG SAFE చేపట్టనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం TG SAFEకు పోలీసు సిబ్బందిని డీజీపీ కేటాయించనున్నారు. తొలిదశలో క్యూర్ ప్రాంతంలో TG SAFE కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.


క్యూర్ ప్రాంతంలో ఆహార వ్యాపారాలు, డ్రగ్స్ సంస్థలు అధికంగా ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఫుడ్, డ్రగ్స్ నియంత్రణ వ్యవస్థ ఆధునీకరణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేయనుంది. టెస్టింగ్, ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, లీగల్ సపోర్ట్, ల్యాబ్ మౌలిక వసతులపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. TG SAFE ఏర్పాటు ద్వారా ప్రజారోగ్యం, వినియోగదారుల భద్రతకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఆగస్టు 15, 2026 నుంచి TG SAFE ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నంబర్ 67 జారీ చేసింది.


టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మొహంతి

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మొహంతిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అవినాశ్ మొహంతికి అదనపు బాధ్యతలను రాష్ట్ర సర్కార్ అప్పగించింది. ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా అవినాశ్ మొహంతి ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాల సమన్వయానికి TG SAFEను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండు విభాగాలను యూనిఫైడ్ అడ్మినిస్ట్రేషన్‌గా ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్‌పై పరిపాలనా నియంత్రణ TG SAFE కమిషనర్‌కు అప్పగించింది. అవినాశ్ మొహంతిని TG SAFE కమిషనర్‌గా నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.


వార్తలు కూడా చదవండి...

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 02:19 PM