Share News

రెండుచోట్ల 170 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:20 AM

రాష్ట్రంలో రెండుచోట్ల ఒడిసా నుంచి స్మగ్లింగ్‌ చేస్తున్న గంజాయి పట్టుబడింది. సూర్యాపేటలో శనివారం మరమ్మతుకు గురై రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారులో 110 కిలోల గంజాయి లభ్యమైంది.

రెండుచోట్ల 170 కిలోల గంజాయి స్వాధీనం
170 Kg Ganja Seized

  • సూర్యాపేటలో కారులో 110 కిలోలు లభ్యం

  • ఘట్‌కేసర్‌ వద్ద మరో కారులో 60 కిలోలు సీజ్‌

హైదరాబాద్‌ సిటీ/ఘట్‌కేసర్‌ రూరల్‌/సూర్యాపేట/గట్టు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండుచోట్ల ఒడిసా నుంచి స్మగ్లింగ్‌ చేస్తున్న గంజాయి పట్టుబడింది. సూర్యాపేటలో శనివారం మరమ్మతుకు గురై రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారులో 110 కిలోల గంజాయి లభ్యమైంది. ఒడిసా నుంచి గుర్తు తెలియని వ్యక్తులు గంజాయిని కొని ఇన్నోవాలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సూర్యాపేట వచ్చేసరికి వాహనం ఆగిపోయింది. రోడ్డు పక్కన నిలిపి మరమ్మతు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల తనిఖీలో 110 కిలోల గంజాయి లభించింది.


పోలీసులు వచ్చేలోగా నిందితులు పారిపోయారు. మరో ఘటనలో కారులో ఒడిసా నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు మహమ్మద్‌ అమీర్‌, మహమ్మద్‌ ఇమ్రానుద్దీన్‌లను ఎస్‌వోటీ, పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు ఘట్‌కేసర్‌ వద్ద పట్టుకున్నారు. కారులో వెనక సీట్ల కింద చిన్న ప్యాకెట్లలో అమర్చిన 60 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో కిలో రూ.7 వేలకు చొప్పున 60 కిలోలు గంజాయి కొని హైదరాబాద్‌ మీదుగా ముంబైకి సరఫరా చేస్తున్నారు. అక్కడ రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. రెండుచోట్లా పట్టుబడిన గంజాయి విలువ రూ.80 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అతివేగం మిగిల్చిన విషాదం!

గంజాయి లేడీ డాన్‌ నిత్తూ చిక్కింది

ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 04:21 AM