Share News

అతివేగం మిగిల్చిన విషాదం!

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:14 AM

అతి వేగం మూడు నిరుపేద కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

అతివేగం మిగిల్చిన విషాదం!
Mancherial Road Accident

  • టిప్పర్‌ను ఓవర్‌టేక్‌ చేసే యత్నం..

  • అదుపు తప్పి దాన్నే ఢీకొన్న బైక్‌

  • ముగ్గురు యువకుల దుర్మరణం

  • మంచిర్యాల జిల్లా గుడిపేటలో ఘటన

హాజీపూర్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): అతి వేగం మూడు నిరుపేద కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గుడిపేట సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. మంచిర్యాల నుంచి లక్షెట్టిపేట వైపు ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తున్నారు. గుడిపేట ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించారు.


అదే సమయంలో ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో, దాన్ని తప్పించబోయి అదుపు తప్పి టిప్పర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మంచిర్యాల పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన సోహెల్‌ (21), జాఫర్‌నగర్‌కు చెందిన అఫ్రోజ్‌ (24) అక్కడికక్కడే మృతి చెందారు. నస్పూర్‌ పట్టణంలోని సీసీసీ కృష్ణ కాలనీకి చెందిన వేముల సిద్ధార్థ్‌ (21) తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో సిద్దార్థ్‌ కూడా కన్నుమూశాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సోహెల్‌ సోదరుడు బబ్లూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

గంజాయి లేడీ డాన్‌ నిత్తూ చిక్కింది

ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 04:14 AM