Share News

గంజాయి లేడీ డాన్‌ నిత్తూ చిక్కింది

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:06 AM

ప్రపంచం దృష్టిలో కిరాణా దుకాణం నిర్వహించే ఓ సాధారణ మహిళ ఆమె.. కానీ, ఆ దుకాణం మాటున ఆమె చేసేది గంజాయి దందా.. అది కూడా మామూలుగా కాదు.. కుటుంబసభ్యులతో కలిసి తొమ్మిదేళ్లుగా ..

గంజాయి లేడీ డాన్‌ నిత్తూ చిక్కింది
Nithu Bhai Arrest

  • ఏళ్లుగా గంజాయి దందా, 30కి పైగా కేసులు

  • 13 కేసుల్లో వాంటెడ్‌గా కళాపతి నిత్తూభాయి

  • కొన్ని నెలలుగా పోలీసుల కళ్లుగప్పి సంచారం

  • ఆటోలో వెళ్తుండగా శుక్రవారం పట్టుకున్న ‘ఈగల్‌’

  • గంజాయి దందాతో రూ.కోట్లకు పడగలెత్తిన నిత్తూ కుటుంబం.. లంగర్‌హౌస్‌లో రెండు జీప్లస్‌3 ఇళ్లు

  • గచ్చిబౌలిలో ఓ జీప్లస్‌2 ఇల్లు

హైదరాబాద్‌, నవంబరు7(ఆంధ్రజ్యోతి): ప్రపంచం దృష్టిలో కిరాణా దుకాణం నిర్వహించే ఓ సాధారణ మహిళ ఆమె.. కానీ, ఆ దుకాణం మాటున ఆమె చేసేది గంజాయి దందా.. అది కూడా మామూలుగా కాదు.. కుటుంబసభ్యులతో కలిసి తొమ్మిదేళ్లుగా ఈ దందా నిర్వహిస్తున్న ఆ మహిళ హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ ప్రాంతాన్ని గంజాయి అడ్డాగా మార్చేసి రూ.కోట్లు పోగోసుకుంది. 30 కేసుల్లో నిందితురాలిగా.. ప్రస్తుతం 13 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న నానక్‌రాంగూడ గంజాయి లేడీ డాన్‌ కళాపతి నిత్తూభాయి ఎట్టకేలకు ఈగల్‌ బృందానికి చిక్కింది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మొబైల్‌ఫోన్‌ వాడడం మానేసిన నిత్తూభాయి.. కొన్ని నెలలుగా హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులతోపాటు ఈగల్‌ ఫోర్స్‌ను కూడా ముప్పుతిప్పలు పెడుతోంది. ఆమెపై నిఘా పెట్టిన ఈగల్‌ బృందం.. లంగర్‌హౌ‌స్-మంగళ్‌హట్‌ ప్రాంతంలో వెళుతున్న ఓ ఆటోలో నిత్తూ భాయిని గుర్తించి శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఆమె వద్ద రూ.1,59,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.


ఫ్యామిలీ బిజినెస్‌, కోట్ల విలువ చేసే ఆస్తులు

నిత్తూ భాయి కుటుంబమంతా గంజాయి దందాలో ఆరితేరింది. నిత్తూపై వివిధ పోలీసుస్టేషన్‌ల్లో 30కిపైగా గంజాయి కేసులు ఉండగా 17 కేసుల్లో అరెస్టయి బెయిల్‌పై బయటకొచ్చింది. ఆ తర్వాత కూడా దందా కొనసాగిస్తోంది. కిరాణా దుకాణం ముసుగులో తొమ్మిదేళ్లుగా నానక్‌రాంగూడలో గంజాయి దందా చేస్తున్న నిత్తూభాయికి లంగర్‌హౌస్‌లో రెండు జీప్లస్‌3 ఇళ్లు, గచ్చిబౌలిలో ఒక జీప్లస్‌2 ఇల్లు ఉన్నాయని, నానక్‌రూంగూడలోని ఇంట్లో అదనపు నిర్మాణం చేపట్టిందని ఈగల్‌ అధికారులు తెలిపారు. నిత్తూభాయి నిర్వహిస్తున్న జయలక్ష్మీ కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్‌ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసిన అధికారులు.. ఆర్థికలావాదేవీలపై విచారణ చేపట్టారు.


గతేడాది జూన్‌లో నానక్‌రాంగూడలోని నిత్తూభాయి ఇంట్లో సోదాలు చేసిన సైబరాబాద్‌ నార్కోటిక్స్‌ పోలీసులు భారీగా గంజాయి, రూ.2.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2023లో నిత్తూభాయి కొడుకును అరెస్టు చేసిన గోల్కోండ పోలీసులు అతని కారులో 22కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వారి ఇళ్లల్లో జరిపిన సోదాల్లో రూ.40లక్షల నగదును సీజ్‌ చేశారు. 2023 అక్టోబరులో గచ్చిబౌలి పోలీసులు ఆమె ఇంట్లో 7.5కిలోల గంజాయి, రూ.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2024 మార్చిలో 22 కిలోల గంజాయి, రూ.22లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 04:06 AM