Share News

నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కసరత్తు

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:59 AM

రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు.

నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కసరత్తు
Mahesh Kumar Goud

  • కార్పొరేషన్‌ చైర్మన్లతో పాటు డైరెక్టర్‌ పదవులను భర్తీ చేస్తాం: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. కార్పొరేషన్లు, ఇతర వాటికి చైర్మన్లతో పాటు డైరెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నామన్నారు. శనివారం ఎమ్మెల్యే క్వార్టర్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలపై అధిష్ఠానానికి నివేదికను సమర్పించానని తెలిపారు.


పార్టీ కార్యక్రమాల గురించి సమయానుకూలంగా నివేదికలను పంపాల్సి ఉంటుందన్నారు. గతంలో ఉన్నట్లు ఇప్పుడు హైకమాండ్‌ లేదని, నేతల పనితీరుపై ఏఐసీసీలో పెద్ద వ్యవస్థ పనిచేస్తోందని చెప్పారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల భర్తీపై పార్టీలో ఇంకా చర్చ జరగలేదని వెల్లడించారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 04:59 AM