బతుకమ్మతో తెలంగాణ సంస్కృతి వైభవం చాటాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Oct 09 , 2026 | 08:54 PM
రాష్ట్రంలోని ఆడ బిడ్డలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలందరూ ఆటపాటలతో అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆడ బిడ్డలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలందరూ ఆటపాటలతో అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ ప్రత్యేకత అని ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతకు బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని ముఖ్యమంత్రి అభివర్ణించారు.
బతుకమ్మ సంబురాలు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలి..
ప్రజల సాంస్కృతిక వైభవాన్ని, మహిళల ఐక్యతను చాటిచెప్పే ఈ పండుగలో ఎన్నో సామాజిక అంశాలు ఇమిడి ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ప్రకృతిని ఆరాధించే తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. బతుకమ్మ సంబురాలు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.
జోగుళాంబ కల్యాణోత్సవానికి సీఎం రేవంత్‌కు ఆహ్వానం..
అలంపూర్ జోగుళాంబ అమ్మవారి కల్యాణోత్సవం ఈ నెల 16వ తేదీన జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆలయ కమిటీ ప్రతినిధులు ఈరోజు (శుక్రవారం) ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎంను జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హన్మంతరావు, గద్వాల సంస్థాన వారసుడు కృష్ణ రామభూపాల్, జోగుళాంబ అమ్మవారి దేవస్థానం ఈవో దీప్తి ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఎక్స్‌లో పోస్టు పెట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఈసీ, కేంద్ర విధానాలపై మా పోరాటం ఆగదు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణను అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి: సీఎస్
మహిళా సాధికారతకు కొత్త అడుగు.. జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News