చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ ఐటీ హబ్ అయ్యింది: సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Mar 12 , 2026 | 08:45 PM
తెలంగాణ సమగ్రాభివృద్ధి కేవలం భవన నిర్మాణాలతోనే సాధ్యం కాదని, నాణ్యమైన విద్య, వైద్యం సామాన్యుడికి చేరినప్పుడే అసలైన ప్రగతని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ (Telangana) రాష్ట్ర సమగ్రాభివృద్ధి కేవలం భవన నిర్మాణాలతోనే సాధ్యం కాదని నాణ్యమైన విద్య, వైద్యం సామాన్యుడికి చేరినప్పుడే అసలైన ప్రగతని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ‘వైద్యం యాంత్రికంగా ఉండకూడదు.. అది మానవత్వంతో కూడిన సేవగా ఉండాలి’ అనే నినాదంతో కాంగ్రెస్ సర్కార్ కీలక అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నగరం నేడు ప్రపంచ పటంలో నిలవడానికి గత పాలకులు ఎంతో కృషి చేశారని అన్నారు.
హైదరాబాద్‌లో నేడు ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పీవీ నరసింహారావుల సరళీకరణ విధానాలు హైదరాబాద్ అభివృద్ధికి బీజం వేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆధ్వర్యంలో హైటెక్ సిటీ పూర్తి అయ్యింది. ఆ తర్వాత నగరం ఐటీ హబ్‌గా రూపాంతరం చెందింది. దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం వాటా ఒక్క హైదరాబాద్‌దే కావడం ఎంతో గర్వకారణం. కరోనా సమయంలో ప్రపంచాన్ని కాపాడిన మూడు వ్యాక్సిన్లు మన జినోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి కావడం రాష్ట్రానికి గర్వకారణం’ అని అన్నారు.
అంతకుముందు హైదరాబాద్ కోకాపేటలో అల్లు సినిమాస్(Allu Cinemas) పేరుతో అల్లు అరవింద్ నెలకొల్పిన భారీ మల్టీప్లెక్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత నటుడు అల్లు రామలింగయ్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం ఈ వేడుక సినీ, రాజకీయ నాయకుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ఊతం: మంత్రి నారాయణ
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News