తెలంగాణ ప్రగతిలో యాదవుల భాగస్వామ్యం అవసరం: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:00 PM
యాదవులు కొరగానే తమ ప్రభుత్వం సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది యాదవులకే కాదని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి ఆత్మగౌరవ సమ్మేళనమని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): యాదవులు కొరగానే తమ ప్రభుత్వం సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఇది యాదవులకే కాదని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి ఆత్మగౌరవ సమ్మేళనమని పేర్కొన్నారు. యాదవ సోదరులందరికీ సదర్ సమ్మేళన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో ఈరోజు (బుధవారం) హైదరాబాద్ NTR స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. యాదవ సోదరుల ఆత్మగౌరవానికి ఎక్కడా లోటు లేకుండా చూసే బాధ్యత తమదని మాటిచ్చారు.
భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం..
దేశంలో తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలనేదే తమ ప్రయత్నమని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని.. ఇందుకు యాదవ సోదరుల సహకారం ఉండాలని కోరారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటి గోల్కొండ కోట ఒకనాటి గొల్లంకొండ అని ప్రస్తావించారు. యాదవ సోదరుల సహకారంతోనే హైదరాబాద్ నగరం ఇంతగా అభివృద్ధి చెందిందని అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారిని యాదవ సోదరులు ఆదరించి అక్కున చేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రి సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలనే ఆలోచన చేయలేదని పేర్కొన్నారు.
తెలంగాణలో కులగణన చేశాం..
సదర్ సమ్మేళనం నిర్వహణకు తమ ప్రభుత్వంలో రూ.5 కోట్లు మంజూరు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణలో తాము కులగణన చేసి చూపించామని ఉద్ఘాటించారు. రాష్ట్ర మోడల్‌ను దేశం అనుసరించేలా కులగణన నిర్వహించామని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం కల్పించామని వెల్లడించారు. అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్‌కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామని తెలిపారు. ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా నియమించామని ప్రస్తావించారు. యాదగిరి గుట్ట గోశాలలో గోసంరక్షణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే యాదవులకు దక్కాల్సిన వాటా వారికి దక్కేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News