తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు కేబినెట్ నిర్ణయం
ABN , Publish Date - Aug 14 , 2026 | 01:57 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) అధ్యక్షతన ఈరోజు (శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం (Telangana Cabinet) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనుంది.
ఈ సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను కేబినెట్ ఏర్పాటు చేయనుంది. గత ఏడాది కంటే ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి 'ఇన్వెస్ట్ తెలంగాణ' థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించనుంది. ఫ్యూచర్ సిటీ ప్లాన్‌ను ప్రజలకు వివరించనుంది. తెలంగాణలో డిఫెన్స్, ఏరో స్పేస్, ఫార్మాతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా సదస్సు నిర్వహించనుంది. వివిధ రంగాల్లో తెలంగాణ స్టార్టప్, పరిశ్రమలు సాధించిన విజయాలు.. వివిధ రంగాల కొత్త ఆవిష్కరణల ప్రదర్శన ఏర్పాటు చేయాలని మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
వార్తలు కూడా చదవండి...
ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News