Share News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త మలుపు.. శివకుమార్‌కు నోటీసులు

ABN , Publish Date - Apr 25 , 2026 | 09:19 PM

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం, తాజాగా యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ మాజీ సభ్యుడు కె. శివకుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త మలుపు.. శివకుమార్‌కు నోటీసులు
Phone Tapping Case

హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో సాక్ష్యాధారాల సేకరణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా మరో కీలక వ్యక్తికి నోటీసులు జారీ చేసింది. యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ మాజీ సభ్యులైన కె. శివకుమార్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ విచారణను ఎదుర్కోనున్నారు.


నోటీసుల జారీ..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక సమాచారం సేకరించేందుకు శివకుమార్‌కు అధికారులు నోటీసులు పంపారు. మే 28వ తేదీన విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ విచారణ జరగనుందని సిట్ అధికారులు తెలిపారు.


ఈ కేసు నేపథ్యమిదే..

కేసీఆర్ హయాంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ కాగా, తాజాగా సాక్షుల విచారణలో భాగంగా శివకుమార్‌ను పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యాపింగ్ బాధితుల్లో శివకుమార్ పేరు ఉందా..? లేదా..? దీనికి సంబంధించిన ఇతర వివరాలు ఏమైనా ఆయనకు తెలుసా..? అనే కోణంలో అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను వేదికగా చేసుకుని జరుగుతున్న ఈ విచారణ, ఈ కేసును మరింత సమగ్ర సమాచారాన్ని ఛేదించే దిశగా ఈ విచారణ సాగనున్నట్లు తెలుస్తోంది. మే 28వ తేదీన శివకుమార్ ఇచ్చే స్టేట్‌మెంట్ ఈ కేసులో ఎవరి పాత్రను బయటపెడుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు: కీలక నియామకాలు

మంగ్లీ కేసు.. న్యాయవాదికి బ్రీత్ టెస్టు వివాదం.. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 25 , 2026 | 09:25 PM