Share News

సౌదీ తెలుగు ప్రవాసీయులు.. గల్ఫ్‌ భారతీయులందరికీ ఆదర్శం

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:27 AM

గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్న భారతీయ సమాజంలో సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల పాత్ర అత్యంత ప్రముఖమైనదని, వారి క్రియాశీలత మిగిలిన ప్రవాస భారతీయులందరికీ ఆదర్శప్రాయమని సౌదీలో భారత రాయబారి విపుల్‌ ప్రశంసించారు.

సౌదీ తెలుగు ప్రవాసీయులు.. గల్ఫ్‌ భారతీయులందరికీ ఆదర్శం
Saudi Telugu diaspora

  • భారత రాయబారి విపుల్‌

  • సాటా ఆధ్వర్యంలో రియాద్‌లో

  • వైభవంగా ‘తెలుగు భాషా దినోత్సవం’

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి

గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్న భారతీయ సమాజంలో సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల పాత్ర అత్యంత ప్రముఖమైనదని, వారి క్రియాశీలత మిగిలిన ప్రవాస భారతీయులందరికీ ఆదర్శప్రాయమని సౌదీలో భారత రాయబారి విపుల్‌ ప్రశంసించారు. ‘‘దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’’ అనే గురజాడ సూక్తిని సౌదీలోని తెలుగువారు సార్థకం చేస్తున్నారని ఆయన కొనియాడారు.సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్‌ (సాటా) ఆధ్వర్యంలో రియాద్‌ నగరంలో బుధవారం నిర్వహించిన ‘తెలుగు భాషా దినోత్సవం’ వేడుకలకు రాయబారి విపుల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖలో గల్ఫ్‌ విభాగం కార్యదర్శిగా, దుబాయ్‌ కాన్సుల్‌ జనరల్‌గా, ఖతార్‌ రాయబారిగా సేవలందించిన తనకు, సౌదీలో ఉన్నంత చురుకైన, బాధ్యతాయుతమైన తెలుగు సమాజం మరెక్కడా కనిపించలేదని స్పష్టం చేశారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే సేవా కార్యక్రమాల్లో ముందుంటూ మాతృభూమికు నిజమైన సేవ చేస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో సాటా ప్రతినిధులు రంజిత్‌ చిత్తలూరి, జానీ బాషా, ముజ్జమ్మిల్‌ షేక్‌, సుచరిత, చేతన, ఎర్రన్న, యాకూబ్‌, నాగరాజు, సత్తిబాబు తదితరులు పాల్గొని సంస్థ చేపడుతున్న సేవా, సంక్షేమ కార్యకలాపాలను వివరించారు. అనేక తెలుగు ప్రవాసీ కుటుంబాలు వందల కిలో మీటర్ల దూరం ప్రయాణించి మరీ ఈ వేడుకలకు తరలివచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గణపయ్య చెంత.. కమ్మని వంట!

ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 06:27 AM