ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా!
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:19 AM
తాను నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా గురువారం విడుదలవుతున్న సందర్భంగా.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతించాలని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హీరో నాని విజ్ఞప్తి చేశారు.
అనుమతించండి.. ‘ప్యారడైజ్’ విడుదల
సందర్భంగా సీఎంకు, కోమటిరెడ్డికి హీరో నాని విజ్ఞప్తి
స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోండి
పరిస్థితి సమీక్షించి వారు నిర్ణయిస్తారు
సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి స్పందన
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తాను నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా గురువారం విడుదలవుతున్న సందర్భంగా.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతించాలని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హీరో నాని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం, మంత్రి ఇరువురూ స్పందించటం విశేషం. ‘తెలంగాణకు చెందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన సినిమాపై హీరో నాని చూపుతున్న నిబద్ధతను ప్రశంసిస్తున్నా. భారీగా తరలివచ్చే అభిమానులు, ప్రజల భద్రతకు తగిన చర్యలు అవసరమవుతాయి.
అనుమతి కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోండి. అక్కడి పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, జన సమీకరణను పరిగణనలోకి తీసుకుని వారు నిర్ణయం తీసుకుంటారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ.. ‘అభిమానులతో కలిసి సినిమాను వీక్షించాలన్న నాని కోరిక అభినందనీయం. దీనికి సంబంధించి చిత్ర బృందం స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నా. ప్రజలకు, అభిమానులకు అసౌకర్యం కలగకుండా పోలీసు విభాగం తగిన సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటుంది. నాని, శ్రీకాంత్ ఓదెల, చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంచల్‌గూడ జైలుకు ‘బిలియనీర్లు’!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News