హైదరాబాద్‌లో రౌడీ షీటర్ల వీరంగం.. జ్యువెలరీ షోరూమ్‌లోకి చొరబడి బెదిరింపులు
ABN , Publish Date - Jun 27 , 2026 | 09:19 AM
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు వీరంగం సృష్టించిన ఘటన కలకలం రేపింది. రోడ్ నంబర్-10లో ఉన్న శ్రీ సాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్‌లోకి చొరబడి ఇద్దరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు వీరంగం సృష్టించిన ఘటన కలకలం రేపింది. రోడ్ నంబర్-10లో ఉన్న శ్రీ సాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్‌లోకి చొరబడి ఇద్దరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అలీమ్, యూనస్ అనే ఇద్దరు నిందితులు మద్యం మత్తులో షోరూమ్‌లోకి ప్రవేశించి అక్కడి మేనేజర్ పంకజ్ బండ్గర్‌ను కత్తితో బెదిరించారు. అనంతరం లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దౌర్జన్యానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా, తర్వాత వచ్చినప్పుడు డబ్బులు సిద్ధంగా ఉంచాలంటూ హెచ్చరికలు జారీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన షోరూమ్ మేనేజర్ పంకజ్ బండ్గర్ తనకు, సిబ్బందికి ప్రాణహాని ఉందంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులు అలీమ్, యూనస్‌లను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. వ్యాపార సంస్థల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులు సూచించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు
మన వాళ్ల హక్కులను కాపాడటంలో వెనక్కు తగ్గేదేలే..: కవిత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News