రాజ్యాంగంపై కేంద్రం కుట్రలను తిప్పికొడతాం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Nov 26 , 2026 | 01:58 PM
రాజ్యాంగంపై కేంద్రం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన సంవిధాన్ రక్షా ర్యాలీలో సీఎం పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 26: రాజ్యాంగంపై కేంద్రం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన సంవిధాన్ రక్షా ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. అన్నివర్గాలకు సమన్యాయం కోసమే రాజ్యాంగమని స్పష్టం చేశారు. రాజ్యాంగంతోనే ప్రజలకు రక్షణ అని చెప్పుకొచ్చారు. పాలకులను ఎన్నుకునే విధానం తెచ్చింది, పరిపాలనను ప్రజల చేతుల్లో పెట్టింది రాజ్యాంగమే అని అన్నారు.
రాజ్యాంగంపై మోదీ ముఠా చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని సీఎం అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. అహింసతోనే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టొచ్చని కాంగ్రెస్ నిరూపించిందని వెల్లడించారు. అహింసతో స్వాతంత్ర్యం సాధించిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. కొన్ని పార్టీలు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలోని పేదలు, అణగారినవర్గాలకు ఓటుహక్కు ఉండకూడదన్నదే బీజేపీ కుట్ర అని ఆరోపించారు.
భాష, మతం, ప్రాంతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దళిత, గిరిజన, మైనారిటీ ఓట్లు తొలగిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఓటరు జాబితాలో ఎవరు ఉండాలో నిర్ణయించాలని అనుకుంటున్నారని.. ఇందుకు బీజేపీకి ఎన్నికల సంఘం సహకరిస్తోందని ఆరోపణలు గుప్పించారు. అధికారం శాశ్వతం చేసుకోవాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని తెలిపారు. ఇది కాంగ్రెస్ పోరాటం కాదని.. ప్రజల జీవన మనుగడ కోసం చేసే పోరాటమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
‘ఐటీ కంపెనీల పనివేళలు మార్చాలి’.. సైబరాబాద్ ట్రాఫిక్‌పై డీజీపీ సీవీ ఆనంద్
ప్రైవేట్ స్కూల్లో సిద్దిపేట జిల్లా సైన్స్ ఫేర్.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం
Read Latest Telangana News And Telugu News