ప్రైవేట్ స్కూల్లో సిద్దిపేట జిల్లా సైన్స్ ఫేర్.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం
ABN , Publish Date - Nov 26 , 2026 | 01:44 PM
సిద్దిపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో జరగాల్సిన జిల్లా సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఓ ప్రైవేట్ స్కూల్లో జరపడంపై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు.
సిద్దిపేట, నవంబర్ 26: సిద్దిపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో జరగాల్సిన జిల్లా సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఓ ప్రైవేట్ స్కూల్లో జరపడంపై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. కనీసం సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో జరిపే స్తోమత కూడా సర్కార్‌కు లేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సైన్స్ ఫేర్ అంటే సిద్దిపేటకు జాతీయ స్థాయి అవార్డులు తెచ్చుకున్నామని గుర్తుచేశారు.
సిద్దిపేటకు బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయడం లేదని హరీశ్ మండిపడ్డారు. సగం అకాడమీ పూర్తి అయినా.. నేటికీ ఒక జత బట్టలు మాత్రమే విద్యార్థులకు అందినట్లు తెలిపారు. నేడు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్‌పై కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటపై వివక్షతో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వెంటనే సిద్దిపేటకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న దుస్తులను పంపిణీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్.. రెండు లక్షల ఉద్యోగాలు మిథ్య అంటూ విమర్శలు
‘ఐటీ కంపెనీల పనివేళలు మార్చాలి’.. సైబరాబాద్ ట్రాఫిక్‌పై డీజీపీ సీవీ ఆనంద్
Read Latest Telangana News And Telugu News