Share News

‘ఐటీ కంపెనీల పనివేళలు మార్చాలి’.. సైబరాబాద్ ట్రాఫిక్‌పై డీజీపీ సీవీ ఆనంద్

ABN , Publish Date - Nov 26 , 2026 | 01:25 PM

అన్ని ఆఫీసులకు ఒకే పనివేళలు ఉండటంతో తీవ్ర రద్దీ నెలకొందని.. ఐటీ కంపెనీల పనివేళలు మార్చాల్సిన అవసరం ఉందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు.

‘ఐటీ కంపెనీల పనివేళలు మార్చాలి’.. సైబరాబాద్ ట్రాఫిక్‌పై డీజీపీ సీవీ ఆనంద్
CV Anand DGP

హైదరాబాద్, నవంబర్ 26: అన్ని ఆఫీసులకు ఒకే పనివేళలు ఉండటంతో తీవ్ర రద్దీ నెలకొందని.. ఐటీ కంపెనీల పనివేళలు మార్చాల్సిన అవసరం ఉందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. సైబరాబాద్ మూవ్స్ ఇన్ 2026 సదస్సులో డీజీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్‌లో వీధుల అనుసంధానం సరిగ్గా లేదని.. వర్షం పడితే ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్ తరహాలో వన్-వే లూప్‌లు, ఫ్రీ లెఫ్ట్‌లు, యూ-టర్న్‌లు తీసుకురావాలని చెప్పుకొచ్చారు.


ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక క్యారేజ్ వే, కౌంటర్-ఫ్లో బస్ లేన్ వంటి వినూత్న ప్రయోగాలు చేయాలని డీజీపీ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు మార్చినప్పుడు తొలి 2-3 రోజులు వచ్చే విమర్శలకు పోలీసులు భయపడొద్దని.. ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. మియాపూర్‌లో రోడ్ల వెడల్పు, కంపెనీల భాగస్వామ్యంతో ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ప్రజా రవాణాపై అవగాహన కల్పించాలని తెలిపారు.


చిన్న ప్రాంతంలోనే 10 లక్షల ఉద్యోగాలు, నివాస ప్రాంతాలు కలిసిపోవడంతో రద్దీ విపరీతంగా పెరిగిందని డీజీపీ చెప్పారు. మెట్రో విస్తరణ, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల సేవలు మెరుగుపడితేనే ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. టీ-హబ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించడం వినూత్న ఆలోచనలకు నిదర్శనమన్నారు. అందరూ సహకరిస్తే సైబరాబాద్ సుందరంగా మారుతుందని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు

రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్.. రెండు లక్షల ఉద్యోగాలు మిథ్య అంటూ విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 01:25 PM