Share News

ఏపీలో పంచాయతీ పోలింగ్ జోరు.. ఉదయం 11 గంటలకు 53.86 శాతం ఓటింగ్

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:36 PM

ఏపీలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 53.86 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల సమయానికి 16.25 శాతంగా ఉన్న పోలింగ్.. రెండు గంటల్లోనే భారీగా పుంజుకుని 53.86 శాతానికి చేరింది.

ఏపీలో పంచాయతీ పోలింగ్ జోరు.. ఉదయం 11 గంటలకు 53.86 శాతం ఓటింగ్
AP Voting Percentage

అమరావతి, నవంబర్ 26: ఏపీలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 53.86 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల సమయానికి 16.25 శాతంగా ఉన్న పోలింగ్.. రెండు గంటల్లోనే భారీగా పుంజుకుని 53.86 శాతానికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా టాప్‌లో నిలిచింది. ఆ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు అత్యధికంగా 75.02 శాతం ఓటింగ్ నమోదైంది. అల్లూరి జిల్లా తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో 67.70 శాతం, మార్కాపురంలో 64.02 శాతం, అనంతపురం జిల్లాలో 64.01 శాతం పోలింగ్ జరిగింది.


వైఎస్సార్ కడప జిల్లాలో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు కేవలం 20.22 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలవరం జిల్లాలో 34.35 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 43.11 శాతం, విజయనగరం జిల్లాలో 43.73 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. అలాగే కాకినాడ (62.13%), నెల్లూరు (60.94%), పార్వతీపురం మన్యం (60.42%), చిత్తూరు (60.05%) జిల్లాల్లో పోలింగ్ 60 శాతం దాటింది. అటు మార్కాపురం జిల్లాలో ఉదయం 9 గంటల సమయానికి 2.60 శాతంగా ఉన్న పోలింగ్.. 11 గంటల సమయానికి 64.02 శాతానికి ఓటింగ్ శాతం ఎగబాకింది.


జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు

  • ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం - 44.01 శాతం, పార్వతీపురం మన్యం - 60.42 శాతం, విజయనగరం - 43.73 శాతం, అనకాపల్లి - 52.94 శాతం, అల్లూరి సీతారామరాజు - 75.02శాతం.

  • గోదావరి, మధ్య ఆంధ్ర: పోలవరం - 34.35 శాతం, కాకినాడ - 62.13 శాతం, కోనసీమ - 47.47 శాతం, తూర్పు గోదావరి - 59.99 శాతం, పశ్చిమ గోదావరి - 59.21 శాతం, ఏలూరు - 52.33 శాతం.

  • కృష్ణా, గుంటూరు ప్రాంతం: కృష్ణా - 47.04 శాతం, ఎన్టీఆర్ - 43.11 శాతం, పల్నాడు - 55.13 శాతం, బాపట్ల - 50.02 శాతం.

  • ప్రకాశం, నెల్లూరు: ప్రకాశం - 51.01 శాతం, మార్కాపురం - 64.02 శాతం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు - 60.94 శాతం.

  • రాయలసీమ: తిరుపతి - 51.06 శాతం, చిత్తూరు - 60.05 శాతం, అన్నమయ్య - 59.58 శాతం, వైఎస్సార్ కడప - 20.22 శాతం, అనంతపురం - 64.01 శాతం, శ్రీ సత్యసాయి - 67.70 శాతం, కర్నూలు - 58.64 శాతం, నంద్యాల - 56.19 శాతం.


null

ఇవి కూడా చదవండి...

ఎన్నికల భద్రతకు కోనసీమ పోలీసుల హైటెక్ అస్త్రం.. ‘K-ORBIT’ యాప్‌తో పర్యవేక్షణ

ఏపీలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ పోలింగ్: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 12:42 PM