ఏపీలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ పోలింగ్: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:19 PM
ఏపీలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని విజ్ఞాన విహార స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సందర్శించారు.
విజయవాడ, నవంబర్ 26: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని విజ్ఞాన విహార స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది విధులను కమిషనర్ పరిశీలించారు.
ఓటర్లకు కల్పించిన మౌలిక సదుపాయాలు, పోలింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును ఎస్‌ఈసీ సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి అమలు తీరును అనిల్ చంద్ర తనిఖీ చేశారు.
భారీగా పోలింగ్: ఎస్‌ఈసీ
గ్రామ పంచాయతీల్లో పోలింగ్ భారీగా జరుగుతోందని ఎస్ఈసీ తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గతంలో కన్నా పోలింగ్ బాగా జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటనలు జరిగాయని అన్నారు. ఎన్నికలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఈ పర్యటనలో ఎస్ఈసీతో పాటు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశా కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు
ఎన్నికల భద్రతకు కోనసీమ పోలీసుల హైటెక్ అస్త్రం.. ‘K-ORBIT’ యాప్‌తో పర్యవేక్షణ
Read Latest AP News And Telugu News