మైనర్ అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. తీర్పు వెలువరించిన కోర్టు
ABN , Publish Date - Nov 19 , 2026 | 07:26 PM
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో మైనర్‌పై అత్యాచారం కేసులో నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాధత బాలికకు రూ. 5 లక్షల పరిహారంతో పాటు, రూ. 21 వేల జరిమానాను న్యాయస్థానానికి చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 19: నగరంలోని రాజేంద్రనగర్‌లో 2021 సెప్టెంబర్‌లో చోటుచేసుకున్న మైనర్ అత్యాచారం ఘటనకు సంబంధించిన కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. నేరం రుజువైన కారణంగా నిందితుడు సుజిత్ రాజ్‌ధర్ అలియాస్ సుధీర్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు.. బాధిత బాలికకు రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
నగరంలోని రాజేంద్రనగర్‌లోని డెయిరీ ఫామ్ ప్రాంతంలో.. 15 ఏళ్ల బాలికపై.. సుజిత్ రాజ్ ధర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు.. 2021 సెప్టెంబర్ 23న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. 2021 సెప్టెంబర్ 28న నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో దర్యాప్తు పూర్తి చేసిన రాజేంద్రనగర్ పోలీసులు 2022 ఫిబ్రవరి 10న కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి శిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి
ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుపాను.. 24 నుంచి 36 గంటలు అప్రమత్తం
Read latest AP News And Telugu News