మరో ఎమ్మెల్యేనీ బెదిరించాలని చూశారు
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:53 AM
డీప్‌ఫేక్, ఏఐ వీడియోలతో తననే కాక మరో ఎమ్మెల్యేని కూడా బెదిరించేందుకు ఓ ముఠా ప్రయత్నించిందని మజ్లిస్ బహిష్కృత ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ అన్నారు.
ఏఐ వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్ కేసుపై జ్లిస్ బహిష్కృత ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్
హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): డీప్‌ఫేక్, ఏఐ వీడియోలతో తననే కాక మరో ఎమ్మెల్యేని కూడా బెదిరించేందుకు ఓ ముఠా ప్రయత్నించిందని మజ్లిస్ బహిష్కృత ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ అన్నారు. ఈ విషయంలో పోలీసులు తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఎమ్మెల్సీ బేగ్ ఓ బాలికతో శృంగారం చేస్తున్నట్టుగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో ఎంఐఎం పార్టీ ఆగస్టు 27న ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కూడా ఆదేశించింది. వీడియోలు బయటపడిన సమయంలో సౌదీ అరేబియాలో ఉన్న బేగ్‌ను హుటాహుటిన హైదరాబాద్‌కు రప్పించిన పార్టీ శ్రేణులు.. రాజీనామా చేయించేందుకు మండలి కార్యాలయానికి కూడా తీసుకెళ్లారు.
అయితే, బేగ్ వ్యూహాత్మకంగా అక్కడి నుంచి తప్పించుకున్నారని ప్రచారం జరిగింది. నాటి నుంచి బేగ్ అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఓ మతపెద్ద ద్వారా లాబీయింగ్ చేయించడంతో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాజీనామా విషయంలో శాంతించారని సమాచారం. మరోపక్క, డీప్‌ఫేక్, ఏఐ వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేశారని బేగ్ నార్సింగ్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. దీంతో అజ్ఞాతం వీడిన ఎమ్మెల్సీ బేగ్... ఇబ్రహీంబాగ్‌లోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించి, తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News