హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో సాయంత్రం 4గంటల వరకు కరెంట్ కట్
ABN , Publish Date - May 16 , 2026 | 07:22 AM
వేసవి ప్రణాళిక పనుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మైలార్‌దేవుపల్లి సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్: వేసవి ప్రణాళిక పనుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మైలార్‌దేవుపల్లి సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మైలార్‌దేవుపల్లి విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. సుభాన్ కాలనీ ఫేజ్ 1, 2, ఆయేషా కాలనీ, హషమాబాద్, టవర్ గల్లీ, దస్తగిరి నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అసౌకర్యానికి సహకరించాలని శ్రీనివాస్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం
గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News