Share News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

ABN , Publish Date - May 01 , 2026 | 06:31 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా, క్యూలైన్‌ కృష్ణతేజ గెస్ట్‌ మీదుగా శిలాతోరణం సర్కెల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి ఉన్నారు.


ttd1.jpg

మంగళవారం హుండీ ఆదాయం: రూ.4.05 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 72,362

తలనీలాలు సమర్పించినవారు: 29,166


ఈ వార్తలు కూడా చదవండి:

నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు

జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..

Read Latest Telangana News and National News

Updated Date - May 01 , 2026 | 06:31 AM