Share News

దగా జరగకుండా కాపలా కాయండి

ABN , Publish Date - May 01 , 2026 | 06:19 AM

పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో, సీఎం మమ తా...

దగా జరగకుండా కాపలా కాయండి

  • టీఎంసీ శ్రేణులకు మమత పిలుపు

న్యూఢిల్లీ/కోల్‌కతా, ఏప్రిల్‌ 30: పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో, సీఎం మమ తా బెనర్జీ తన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. గురువారం పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి ఓ వీడి యో సందేశంలో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో దగా జరగకుండా మే 4న కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిరంతరం నిఘా పెట్టి కాపలా కాయాలని పిలుపునిచ్చారు. ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు టీఎంసీ కార్యకర్తల మనోఽస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర అని మండిపడ్డారు. గత ఎన్నికల్లోనూ ఎగ్జిట్‌పోల్స్‌ బీజేపీకి అనుకూలంగా వచ్చాయని, చివరకు ఫలితాలు భిన్నంగా వచ్చాయని ఆమె గుర్తుచేశారు.

స్ట్రాంగ్‌రూంలలో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోంది: టీఎంసీ

ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగే అవకాశముందని మమత ఆందోళన వ్యక్తం చేసిన కొద్దిగంటల్లోనే.. టీఎంసీ నాయకులు కునాల్‌ ఘోష్‌, శశి పంజా కోల్‌కతాలోని ఈవీఎంలు భద్రపరిచిన నేతాజీ ఇండోర్‌ స్టేడియం ఎదుట ధర్నాకు దిగారు. ఈ కేంద్రంలోని స్ట్రాంగ్‌రూంలో ఈవీఎంలను బీజేపీ నేతలు ట్యాంపరింగ్‌ చేస్తున్నారంటూ ఆరోపించారు. పార్టీ ఏజెంట్లు ఎవరూ లేని సమయంలో.. బ్యాలెట్‌ బాక్సులను అక్రమంగా తెరిచారని, దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు తమవద్ద ఉన్నాయని టీఎంసీ పేర్కొంది. కాగా, మమత గురువారం రాత్రి పొద్దుపోయాక, కోల్‌కతాలోని స్ట్రాంగ్‌రూం వద్ద ఆందోళన చేసి, ఎన్నికల కమిషన్‌ తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు తృణమూల్‌ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎం మెషీన్ల సీలింగ్‌ జరిగిందని స్పష్టం చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..

Updated Date - May 01 , 2026 | 06:19 AM