Share News

మంగ్లీ కేసు: అడ్వకేట్ సుబ్బారావుకు డ్రంకెన్ టెస్ట్.. పోలీసులు ఏమన్నారంటే.?

ABN , Publish Date - Apr 13 , 2026 | 03:00 PM

ప్రముఖ గాయని మంగ్లీ కేసులో బాధితుల తరఫున ఫిర్యాదు ఇవ్వడానికి అడ్వకేట్ సుబ్బారావు పోలీస్ స్టేషన్‌కు ఈరోజు ఉదయం వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు డ్రంకెన్ టెస్ట్ చేశారు.

మంగ్లీ కేసు: అడ్వకేట్ సుబ్బారావుకు డ్రంకెన్ టెస్ట్.. పోలీసులు ఏమన్నారంటే.?
Panjagutta Police

హైదరాబాద్, ఏప్రిల్13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయని మంగ్లీ కేసులో (Mangli Case) బాధితుల తరఫున ఫిర్యాదు ఇవ్వడానికి అడ్వకేట్ సుబ్బారావు పోలీస్ స్టేషన్‌కు ఈరోజు (సోమవారం) ఉదయం వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు డ్రంకెన్ టెస్ట్ చేశారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ క్లారిటీ ఇచ్చారు.


డ్రంకెన్ టెస్టులో అడ్వకేట్ సుబ్బారావుకు 27 పాయింట్లు..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడారు. అడ్వకేట్ సుబ్బారావు మద్యం సేవించారనే అనుమానం తమకు వచ్చిందని.. అందులో భాగంగానే ఆయనకు డ్రంకెన్ టెస్ట్ నిర్వహించామని తెలిపారు. ఈ టెస్టులో ఆయనకు 27 పాయింట్లు వచ్చాయని వెల్లడించారు. ఆయన మద్యం సేవించి పోలీస్ స్టేషన్‌కు రావడంతో.. చర్యలు తీసుకునే విషయంపై పరిశీలిస్తామని అన్నారు. పోలీస్ స్టేషన్ పబ్లిక్ ప్రాపర్టీ.. పోలీస్ స్టేషన్‌కి వచ్చేవారికి కొన్ని నిబంధనలు వర్తిస్తాయని ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు.


ఆధారాలు ఇవ్వలేదు..

ప్రముఖ గాయని మంగ్లీ తనను బెదిరించారని అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేశారని ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. అతను ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని ఆయనకు సమాచారం ఇచ్చామని.. ఇప్పటికీ అడ్వకేట్ ఆధారాలు ఇవ్వలేదని అన్నారు. మంగ్లీ కూడా అడ్వకేట్ సుబ్బారావు తనపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారని అన్నారు. ఆమె ఫిర్యాదుపై న్యాయస్థానం నుంచి అనుమతి వచ్చాక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం శరవేగంగా చర్యలు: మంత్రి ఉత్తమ్

కవిత సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఏడిపించొద్దు: కేటీఆర్

జననాయగన్ కేసులో సైబర్ క్రైమ్ టీమ్ కీలక పురోగతి

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 13 , 2026 | 03:05 PM