Share News

హుజురాబాద్‌లో ఒక్క కొత్త పింఛను ఇచ్చినా రాజీనామా చేస్తా.. రేవంత్‌కు కౌశిక్ రెడ్డి సవాల్

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:42 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో సీఎం ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదని.. పాత పింఛన్లను తొలగించారని విమర్శించారు.

హుజురాబాద్‌లో ఒక్క కొత్త పింఛను ఇచ్చినా రాజీనామా చేస్తా.. రేవంత్‌కు కౌశిక్ రెడ్డి సవాల్
Padi Kaushik Reddy

హైదరాబాద్, నవంబర్ 21: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో సీఎం ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదని.. పాత పింఛన్లను తొలగించారని విమర్శించారు. ‘ఒక్క కొత్త పింఛను ఇచ్చినా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా’ అంటూ సవాల్ విసిరారు. తన నియోజకవర్గంలో 1029పింఛన్లు తొలగించారని తెలిపారు. నాడు వృద్ధులకు రూ.200 ఉన్న పింఛన్‌ను కేసీఆర్ రూ.2000 పెంచారని తెలిపారు. వికలాంగులకు పింఛను రూ.4 వేలకు పెంచారన్నారు.


పింఛన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్న చీటర్ రేవంత్ రెడ్డి అంటూ ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. సిద్దిపేటలో రేవంత్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట కన్నా రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి చేస్తే ముక్కు నేలకి రాసి క్షమాపణలు చెబుతానని అన్నారు. వంద కోట్లతో సిద్దిపేటలో సభ పెట్టి సాధించింది ఏంటని ప్రశ్నించారు.


తెలంగాణ తులసీ వనంలో గంజాయి మొక్క రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌తో రేవంత్‌కు పోలిక లేదన్నారు. సీఎం సభకు వచ్చిన సారవ్వ అనే మహిళ చనిపోయిందని... ఆ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు. దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఒట్లు వేసి మాట తప్పడంతోనే రాష్ట్రంలో కరవు వచ్చిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

ఎండిపోతున్న పంటలకు సీతారామ ప్రాజెక్టు జలాలు.. తుమ్మల కీలక ఆదేశాలు

ఇబ్రహీంపట్నంలో దారుణం.. మూడు రోజుల క్రితం కాళ్లు, తాజాగా మనిషి తల లభ్యం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 01:51 PM