ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. తిరువూరు అడవుల్లోకి చేరిన ‘ఎక్స్‌ప్లోరర్’
ABN , Publish Date - Nov 21 , 2026 | 09:57 AM
ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. ‘ఎక్స్‌ప్లోరర్’ (EXPLORER) అనే పేరుతో గుర్తించిన ఈ పెద్దపులి ప్రస్తుతం తిరువూరు అటవీ ప్రాంతంలోకి చేరింది.
ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 21: జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. ‘ఎక్స్‌ప్లోరర్’ (EXPLORER) అనే పేరుతో గుర్తించిన ఈ పెద్దపులి ప్రస్తుతం తిరువూరు అటవీ ప్రాంతంలోకి చేరింది. మహారాష్ట్ర నుంచి పాపికొండల అటవీ ప్రాంతాల వరకు పులి ప్రయాణం సాగినట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఎవరికీ చిక్కకుండా వివిధ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఎక్స్‌ప్లోరర్ పులి కదలికలు అటవీ అధికారులకు సవాలుగా మారాయి. ఎప్పటికప్పుడు పులి కదలికలను అధికారులు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం తిరువూరు అడవుల్లోకి చేరడంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని ఏ. కొండూరు మండలం పుడమిగట్టు ప్రాంతం నుంచి తిరువూరు మండలం వైపు పులి ప్రయాణం సాగినట్లు గుర్తించారు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున చిక్కుళ్లగూడెం- జి. కొత్తూరు అటవీ ప్రాంతానికి పులి ఎక్స్‌ప్లోరర్ చేరుకుంది. నారికింపాడు- తెలంగాణ గట్టు ప్రాంతం వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలకు తిరువూరు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి సంచరించే సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఏ.కుమార్ సూచించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగవద్దని, రైతులకు పొలాలకు వెళ్లవద్దని ఆర్డీవో హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి
Read Latest AP News And Telugu News