Share News

కిషన్ రెడ్డికి ఎంపీ చామల కౌంటర్.. బీజేపీపై ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:24 PM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఆట మొదలైందని.. రాబోయేది బీజేపీ ప్రభుత్వం అంటూ కిషన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు.

కిషన్ రెడ్డికి ఎంపీ చామల కౌంటర్.. బీజేపీపై ప్రశ్నల వర్షం
Chamala Kiran Kumar Reddy

హైదరాబాద్, నవంబర్ 21: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఆట మొదలైందని.. రాబోయేది బీజేపీ ప్రభుత్వం అంటూ కిషన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. ‘మీరు ఆట ఆడబట్టి 3 దశాబ్దాలు అయింది. ఇప్పటి వరకు ఒక్క గోల్ కొట్టిన దాఖలాలు లేవు. దేశంలో బత్తాయి ఆరెంజ్ కలర్‌లో ఉంటే.. తెలంగాణలో మాత్రం పింక్ కలర్‌లో ఉంటుంది’ అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ డబ్బింగ్ చెబితే.. కిషన్ రెడ్డి మాట్లాడుతారని, స్క్రిప్ట్ బీఆర్ఎస్‌ది ప్రజెంటేషన్ బీజేపీది అంటూ విమర్శలు గుప్పించారు.


రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చిందని.. తామే అధికారంలోకి వస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నారని ఎంపీ అన్నారు. ‘ప్రజలకు మీపైన ఏ విధమైన నమ్మకం ఉందని అధికారంలోకి వస్తారు. బీజేపీ స్టాండ్ ఏంటి? కిషన్ రెడ్డి, బండి సంజయ్ ది ఏ లైన్? రాష్ట్రానికి అభివృద్ధి తెచ్చే లైనా? నిధులను రాకుండా అడ్డుకునే లైనా? తెలంగాణకు పెట్టుబడులు రావాలా.. వద్దా? మూసీ అభివృద్ధి జరగొద్దా? మూసిలోనే ప్రజలు మరిగిపోవలా? హైదరాబాద్ మెట్రోను విస్తరించొద్దా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.


హైదరాబాద్‌కు వచ్చే విదేశీయులకు వీసాలు క్యాన్సిల్ చేసినప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడలేదని ఎంపీ విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, రాష్ట్రాన్ని బాగుచేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్రం గురించి కేంద్రమంత్రికి ఏనాడైనా పట్టింపు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణపై కిషన్ రెడ్డికి ప్రేమ లేదంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

మత్స్యకారుల సంక్షేమం.. ఆక్వా రంగ అభివృద్ధే ఏపీ ప్రగతి: చంద్రబాబు

రాజకీయాల్లో వీడ్కోలు ఉండదు.. మాజీ కార్పొరేటర్లకూ సమాన గౌరవం: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 01:55 PM