Share News

మత్స్యకారుల సంక్షేమం.. ఆక్వా రంగ అభివృద్ధే ఏపీ ప్రగతి: చంద్రబాబు

ABN , Publish Date - Nov 21 , 2026 | 10:50 AM

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు, ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటోందని, ఆక్వా రంగ అభివృద్ధి ఏపీ ప్రగతికి కీలకమని ఎక్స్‌లో పేర్కొన్నారు.

మత్స్యకారుల సంక్షేమం.. ఆక్వా రంగ అభివృద్ధే ఏపీ ప్రగతి: చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, నవంబర్ 21: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్సకారులకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటోందని అన్మారు. మత్స్యకారుల సంక్షేమం, ఆక్వా రంగం అభివృద్ధే ఏపీ ప్రగతి అని చెప్పుకొచ్చారు.


చంద్రబాబు పోస్ట్..

‘ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులకు, ఆక్వా రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. సుదీర్ఘ సముద్ర తీరం, డెల్టాలు, జలవనరులతో ఆంధ్రప్రదేశ్ బ్లూ ఎకానమీలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. మత్స్యకారుల సంక్షేమానికి ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా అండగా నిలుస్తున్నాం. మత్స్యకారుల సంక్షేమం -ఆక్వా రంగ అభివృద్ధి-ఆంధ్రప్రదేశ్ ప్రగతి. ఇదే కూటమి ప్రభుత్వ సంకల్పం’ అంటూ ఎక్స్‌లో చంద్రబాబు పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి

ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. తిరువూరు అడవుల్లోకి చేరిన ‘ఎక్స్‌ప్లోరర్’

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 10:56 AM