హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Nov 21 , 2026 | 10:08 AM
హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభం దిమ్మెను ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్, నవంబర్ 21: నగరంలోని ఉప్పల్ భగాయత్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభం దిమ్మెను ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై నాగోల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీపూజ గ్లాస్ హార్డ్‌వేర్ దుకాణం ఎదుట వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభం దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు.
మృతులు మహ్మద్ మునాజిర్ (34), మహ్మద్ సలావుద్దీన్ (35)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి
ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. తిరువూరు అడవుల్లోకి చేరిన ‘ఎక్స్‌ప్లోరర్’
Read Latest Telangana News And Telugu News