Share News

రాజకీయాల్లో వీడ్కోలు ఉండదు.. మాజీ కార్పొరేటర్లకూ సమాన గౌరవం: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:34 PM

రాజకీయాల్లో వీడ్కోలు అనేది లేదని.. కార్పొరేటర్ అయినా మాజీ కార్పొరేటర్ అయినా రాజకీయ సేవలో సమాన భాగస్వామ్యం ఉంటుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

రాజకీయాల్లో వీడ్కోలు ఉండదు.. మాజీ కార్పొరేటర్లకూ సమాన గౌరవం: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Kotamreddy Sridhar Reddy

నెల్లూరు, నవంబర్ 21: రాజకీయాల్లో వీడ్కోలు అనేది లేదని.. కార్పొరేటర్ అయినా మాజీ కార్పొరేటర్ అయినా రాజకీయ సేవలో సమాన భాగస్వామ్యం ఉంటుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ చివరి సర్వ సభ్య సమావేశం జరిగింది. వీడ్కోలు సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలతో కలిసి పని చేసేవారికి ఎప్పుడూ గౌరవం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా కలిసి పని చేద్దామన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ వ్యూహాలు, ఎత్తులు పైఎత్తులు సహజమని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.


ప్రస్తుత మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఐదేళ్లు కార్పొరేషన్‌లో కలిసి పని చేశామని.. తాను డిప్యూటీ మేయర్ నుంచి మేయర్‌గా రేపటి నుంచి విధుల్లోకి రానున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ సమావేశంలో తన వల్ల వ్యక్తిగతంగా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. ‘కొత్త పాలకవర్గం దృష్టికి మీరు కూడా సమస్యలు తీసుకు వచ్చి ప్రజాసేవలో భాగంకావాలి’ అంటూ మేయర్ రూప్ కుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. తిరువూరు అడవుల్లోకి చేరిన ‘ఎక్స్‌ప్లోరర్’

మత్స్యకారుల సంక్షేమం.. ఆక్వా రంగ అభివృద్ధే ఏపీ ప్రగతి: చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 12:47 PM