ఎండిపోతున్న పంటలకు సీతారామ ప్రాజెక్టు జలాలు.. తుమ్మల కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:09 PM
చేతికందే పంట పొలాలు ఎండి పోకుండా సీతారామ ప్రాజెక్టు భరోసాగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతులు మొరపెట్టుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 21: చేతికందే పంట పొలాలు ఎండి పోకుండా సీతారామ ప్రాజెక్టు భరోసాగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతులు మొరపెట్టుకున్నారు. చివరి తడి కోసం సాగునీరు విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు మంత్రి చర్యలు చేపట్టారు. చివరి తడి కోసం సాగునీరు విడుదల చేయాలని రైతులు చేసిన విజ్ఞప్తిపై ఆయన వెంటనే స్పందించారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు వైరా-ఏన్కూరు, రామచంద్రపురం మేజర్ కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ జలాలు రేపటికి ఆయా ప్రాంతాలకు చేరుకోనున్నాయి. విడుదల చేసిన నీటిని పంటల సాగుకు మాత్రమే వినియోగించుకోవాలని రైతులకు మంత్రి సూచించారు. చివరి తడి అందించి పంటలను కాపాడాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. తిరువూరు అడవుల్లోకి చేరిన ‘ఎక్స్‌ప్లోరర్’
హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Read Latest Telangana News And Telugu News