ఇబ్రహీంపట్నంలో దారుణం.. మూడు రోజుల క్రితం కాళ్లు, తాజాగా మనిషి తల లభ్యం
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:25 PM
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మనిషి తల కలకలం రేపుతోంది. గాంధీనగర్ కాలనీలో వరుసగా మనిషి శరీర భాగాలు బయటపడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
రంగారెడ్డి, నవంబర్ 21: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మనిషి తల కలకలం రేపుతోంది. గాంధీనగర్ కాలనీలో వరుసగా మనిషి శరీర భాగాలు బయటపడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే ప్రాంతంలో మూడు రోజుల క్రితం మనిషికి చెందిన కాళ్లు లభ్యమయ్యాయి. తాజాగా అక్కడే మనిషి తల బయటపడింది. వరుస ఘటనలతో కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తలను పరిశీలించారు. ఈ శరీర భాగాలు ఎవరివి.. ఇక్కడకు ఎలా వచ్చాయి అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
ఇటీవల లభించిన కాళ్లు.. ఇప్పుడు బయటపడిన తల.. ఒకే వ్యక్తికి చెందిన శరీర భాగాలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య చేసి శరీర భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శరీర భాగాల గుర్తింపు, ఘటన వెనుక కారణాలపై మిస్టరీ వీడాల్సి ఉంది. ఇబ్రహీంపట్నంలో వరుసగా మనిషి శరీర భాగాలు బయటపడుతుండటం సంచలనం సృష్టిస్తోంది.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ఎండిపోతున్న పంటలకు సీతారామ ప్రాజెక్టు జలాలు.. తుమ్మల కీలక ఆదేశాలు
Read Latest Telangana News And Telugu News