Share News

భారీ డిస్కౌంట్లు ఇస్తామంటే నమ్మొద్దు: టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:48 PM

రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

భారీ డిస్కౌంట్లు ఇస్తామంటే నమ్మొద్దు: టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
cyber frauds

హైదరాబాద్, నవంబర్ 11: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా నకిలీ ఆన్‌లైన్ ప్రకటనలు, క్రెడిట్, డెబిట్ కార్డుల పేరుతో ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారని.. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ప్రజలకు పబ్లిక్ అడ్వైజరీ జారీ చేసింది. సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనల పేరుతో.. వల పన్ని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇందుకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లను వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. ముందుగా.. బ్రాండెడ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, దుస్తులపై భారీ డిస్కౌంట్లంటూ ప్రకటనలు ఇచ్చి.. అనంతరం UPI (యూపీఐ), డిజిటల్ వాలెట్లు, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తారని.. ఆ తర్వాత నకిలీ ఆర్డర్ కన్ఫర్మేషన్ పంపి డెలివరీ ఆలస్యమంటూ.. నమ్మించే ప్రయత్నం చేస్తారని.. డబ్బులు తీసుకున్న తర్వాత బాధితుల ఫోన్ నంబర్లు బ్లాక్ చేయడంతో పాటు.. నకిలీ వెబ్‌సైట్లను కూడా మాయం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వస్తువులు అందకపోవడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచించారు.


క్రెడిట్, డెబిట్ కార్డుల పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు.. మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మోసాలు జరిగే తీరును వివరించారు. సైబర్ నేరగాళ్లు.. ముందుగా బ్యాంక్ రివార్డులు, క్యాష్‌బ్యాక్, కార్డు లిమిట్ పెంపు పేరులో ఫిషింగ్ లింకులను పంపుతారని.. లేదంటే, రూ.5 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ పెంచుతామంటూ నకిలీ మెసేజ్‌లు పంపి.. వాటి ద్వారా హానికరమైన ఏపీకే ఫైల్స్‌ను పంపుతారని పోలీసులు తెలిపారు. ఆ లింకులపై క్లిక్ చేయగానే కార్డు వివరాలు తస్కరణకు గురవుతాయని.. ఇలా కార్డు నంబర్, CVV, PIN, OTP వివరాలను కేటుగాళ్లు సేకరిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. బాధితుల ఫోన్స్‌కు SMS అలర్ట్‌లు రాకుండా.. మొబైల్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తున్నారని వెల్లడించారు. ఈ విధంగా బాధితుల అనుమతి లేకుండానే.. నిమిషాల్లో వారి అకౌంట్ల నుంచి నేరగాళ్లు డబ్బులను కాజేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలను కూడా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి సందర్భాల్లో.. బాధితులు వెంటనే స్పందించి.. కార్డును బ్లాక్ చేసి.. తక్షణమే బ్యాంకుకు సమాచారం అందించాలని సైబర్ పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో నవజాత శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా వైద్యులకు ప్రత్యేక శిక్షణ

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 06:04 PM