Share News

ఏపీలో నవజాత శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా వైద్యులకు ప్రత్యేక శిక్షణ

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:21 PM

నవజాత శిశువుల సంరక్షణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. శిశువుల ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పోర్టల్ వినియోగంపై వైద్య సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఏపీలో నవజాత శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా వైద్యులకు ప్రత్యేక శిక్షణ
fbnc portal training

అమరావతి, నవంబర్11: నవజాత శిశువుల సంరక్షణపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. శిశువుల ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన ‘ఎఫ్‌బీఎన్‌సీ’ (ఫెసిలిటీ బేస్డ్ న్యూబోర్న్ కేర్) పోర్టల్ వినియోగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు పోర్టల్ వినియోగంపై వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణను కల్పిస్తూ మంగళగిరిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాగా.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద నిర్వహించే ఈ పోర్టల్‌ను.. నవజాత శిశువుల మరణాల సంఖ్యను తగ్గించేందుకు, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు రూపొందించారు.


నవజాత శిశువుల ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన ‘ఎఫ్‌బీఎన్‌సీ’ పోర్టల్‌ వినియోగాన్ని బలోపేతం చేసేందుకు ఏపీ వైద్యశాఖ చర్యలు చేపట్టింది. ఈ పోర్టల్ వినియోగంపై వైద్య సిబ్బందికి రెండు రోజుల పాటు మంగళగిరి సమీపంలోని చినకాకానిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా.. 70 ఆరోగ్య కేంద్రాలకు చెందిన 210 మంది వైద్యులు, నర్సులు, సిబ్బంది.. ఈ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా.. వారికి శిశువుల ఆరోగ్య వివరాల నమోదు, ఆసుపత్రి వైద్య సేవలపై శిక్షణ అందించారు. పోర్టల్ సమాచార విశ్లేషణ ద్వారా ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌బీఎస్‌యూ విభాగాల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తూ.. సమగ్ర సమాచార నమోదు ద్వారా నవజాత శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ డా. సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ

జగన్.. వైఎస్సార్ పేరు చెడగొడుతున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 04:36 PM